ఎన్టీఆర్ బయోపిక్ కోసం రంగంలోకి దిగుతోన్న రానా
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ బయోపిక్ కోసం రంగంలోకి దిగుతోన్న రానా

  • చంద్రబాబు నాయుడు పాత్రలో రానా
  • కొన్ని రోజులుగా జరుగుతోన్న రిహార్సల్స్
  • త్వరలోనే షూటింగులో జాయిన్   
'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. పక్కా ప్లానింగ్ తో దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ .. విద్యాబాలన్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించిన ఆయన, తదుపరి షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ షెడ్యూల్లో రానా కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషించనున్నాడనే విషయం తెలిసిందే. అందువలన కొన్ని రోజులుగా ఆయన చంద్రబాబు నాయుడి బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని ప్రాక్టీస్ చేస్తూ వున్నాడట. ఈ పాత్రకి సంబంధించి ఆయన రిహార్సల్స్ పూర్తయ్యాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ .. చంద్రబాబు నాయుడికి సంబంధించిన మూడు బలమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని పాత్రకుగాను సుమంత్ ను తీసుకునే ఛాన్స్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  
balakrishna
raana

More Telugu News