ధర్మపురి సంజయ్ అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు: పీవోడబ్ల్యూ నేత సంధ్య
Add ap7am to your home Screen

ధర్మపురి సంజయ్ అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు: పీవోడబ్ల్యూ నేత సంధ్య

  • సంజయ్ పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి
  • ‘శాంకరీ’ నర్సింగ్ అమ్మాయిలు నన్ను కలిశారు
  • వాళ్ల హాస్టళ్లకి కూడా వెళతాడట 
టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ పై ఆయన సొంత కళాశాల విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ నేత సంధ్య స్పందింస్తూ.. ‘నిజామాబాద్ లో సంజయ్ నిర్వహించే శాంకరీ కళాశాలపై గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సంజయ్ జూనియర్ కళాశాల నిర్వహించినప్పుడు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు అతను పాల్పడుతుండేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు, శాంకరీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదివే పదమూడు మంది అమ్మాయిలు నా వద్దకు వచ్చారు. అందులో పదకొండు మంది హోం మంత్రిని కలిసి ఓ వినతిపత్రం అందజేశారు.

ధర్మపురి సంజయ్ అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని, వారిపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ‘కళాశాలలో అమ్మాయిలను లావుగా ఉంటే బక్కగా అవ్వమంటాడు.. బక్కగా ఉంటే దొడ్డుగా అవ్వమంటాడు.. అమ్మాయిలకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా? లేదా? అని అడుగుతుంటాడు. బయట హాస్టళ్లలో శాంకరీ కళాశాల విద్యార్థినులు ఉంటే.. అక్కడికి కూడా సంజయ్ వెళ్లి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు’ అని సంజయ్ పై సంధ్య ఆరోపణలు చేశారు.
ds
sanjay
pow leader sandhya

More Telugu News