మళ్లీ భగ్గుమన్న మహారాష్ట్ర.. రోడ్డెక్కిన మరాఠాలు.. 40 బస్సులకు నిప్పు!
- 72 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
- రోడ్డెక్కిన మరాఠ్వాడాలు
- శ్రుతి మించడంతో ఉద్రిక్తత
మరోవైపు పూణెలోని చకన్ ప్రాంతంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు 40 బస్సులకు నిప్పు పెట్టారు. వందకు పైగా వాహనాలను ధ్వంసం చేశారు. పూణె నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులను స్తంభింపజేశారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా, పోలీసులపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. లాతూరులో 22 జిల్లాల నేతలు సమావేశమయ్యారు. రిజర్వేషన్లు ప్రకటించే వరకు పన్నులు కట్టే ప్రసక్తే లేదని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.
మరాఠ్వాడాలు నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. 72వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మరాఠ్వాడాలు ఈ ఆందోళనకు దిగారు.