పాదయాత్ర కోసం మీరు ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా? మీ ఆర్భాటాల కోసం కాపులు నాశనమైపోవాలా?: జగన్ పై మండిపడ్డ ముద్రగడ
- ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు కాపులను సమన్వయకర్తలుగా నియమించారు
- ఒక్కొక్కరితో 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేయిస్తున్నారు
- మీ కోసం కాపు నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారు
అడుగడుగుకు ఒక ఫ్లెక్సీ, గజానికో పెద్ద బోర్డు, పది గజాలకు ఒక గేటు... ఇంత ఖర్చును మా కాపు నేతలు భరించాలా? అని ముద్రగడ ప్రశ్నించారు. మీలా మేము అపర కోటీశ్వరులం కాదని... మీ పాదయాత్ర కోసం కాపు నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని... వారి పిల్లల జీవితాలు నాశనమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పాదాల కిందో, మరొకరి పాదాల కిందో కాపు జాతి అనునిత్యం బతకాలా? మీ మోచేతి నీళ్లు తాగుతూ జీవించాలా? అని ప్రశ్నించారు.