తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ భేటీ
Add ap7am to your home Screen

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ భేటీ

  • అభివృద్ధి అంశాలపై చర్చ
  • కొండారెడ్డిపల్లి అభివృద్ధిని వివరించిన నటుడు
  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సూచనలు
 ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శనివారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. వీరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ అభివృద్ధి అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లి  గ్రామాభివృద్ధిపై ఇరువురు చర్చించారు. అలాగే, పాఠశాలలు బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది.  

ఎన్డీయే ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీ విధానాలపైనా తరచూ విరుచుకుపడుతున్న ప్రకాశ్ రాజ్.. కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఓ రోజంతా ప్రకాశ్‌రాజ్‌తో గడపడం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నా, వాటిపై స్పష్టత లేదు.
Prakash Raj
KTR
Telangana
Actor

More Telugu News