నేను బాగా అలసిపోయాను .. ఆ విషయం చరణ్ గమనించాడు: 'ఛత్రపతి' శేఖర్

  • ధ్రువ' షూటింగ్ జరుగుతోంది
  • నేను బాగా అలసిపోయాను 
  • అది గమనించిన చరణ్ నా దగ్గరికి వచ్చాడు  
వివిధ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించినప్పటికీ, 'ఛత్రపతి' శేఖర్ గానే ఆయన అందరికీ గుర్తు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చరణ్ గురించి ప్రస్తావించాడు. 'మగధీర' సినిమా సమయంలో నాకు చరణ్ తో పరిచయం ఏర్పడింది. 'ఛత్రపతి' సినిమాలో నా నటనను గుర్తుచేస్తూ ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ఆ తరువాత 'రచ్చ' .. 'ఎవడు' .. 'ధ్రువ' సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేశాను.

'ధ్రువ' సినిమా ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఉదయం నుంచి చరణ్ షూటింగులోనే వున్నారు .. ఆ తరువాత నేను జాయిన్ అయ్యాను. ఆ సీన్ ను వన్ మోర్ .. వన్ మోర్ అంటూ చాలాసార్లు చేయడం వలన నేను అలసిపోయాను. అయినా నా కోసం ఒక స్టార్ హీరోను వెయిట్ చేయించడం ఇష్టం లేక, సీన్ చేయడానికి సిద్ధమయ్యాను. దూరం నుంచి గమనించిన చరణ్ .. నా దగ్గరికి వచ్చాడు .

'శేఖర్ ముందు నువ్వు కూర్చో' అంటూ తన దగ్గరున్న ఎనర్జీ డ్రింక్ నాకు ఇచ్చాడు. 'శేఖర్ టెన్షన్ పడకు .. నువ్వు అలసిపోయావని తెలుస్తూనే వుంది .. రెస్ట్ తీసుకో .. నువ్వు ఎప్పుడు చేద్దాం అంటే అప్పుడే చేద్దాం' అన్నాడు. నిజంగా చరణ్ మంచి మనసున్నవాడు .. అంతటి స్టార్ హీరో అలా అనడం నాకు ఆనందాన్ని కలిగించింది .. ఆ తరువాత ఆ సీన్ అనుకున్నట్టుగా వచ్చింది' అని చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
chathrapathi sekhar
charan

More Telugu News