బీజేపీపై మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టిన ఉద్ధవ్ థాకరే!
- నోట్ల రద్దు నిర్ణయానికి క్షణం ఆలస్యం చేయలేదు
- రామ మందిరం విషయంలో మాట్లాడడం లేదు
- 2050కైనా పూర్తవుతుందా?
లోక్‌సభ ఎన్నికల ముందస్తు సన్నాహాల కోసం పూణె వచ్చిన థాకరే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ విషయంలోనూ ఆ పార్టీ అలాగే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై ఇప్పటి వరకు అసలు చర్చే లేదని విమర్శించారు. అసలా విషయాన్నే వారు మర్చిపోయారని అన్నారు. బీజేపీకి కావాల్సినంత మెజారిటీ ఉందని, కాబట్టి దీనిని అమలు చేసి తీరాల్సిందేనన్నారు.