Chandrababu: చంద్రబాబును తిట్టడమే కన్నా పనిగా పెట్టుకున్నారు: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆయన లేరని అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో అవసరం తీరాక ఆ పార్టీని వదిలేసిన వ్యక్తి కన్నా అని విమర్శించారు. నీడనిచ్చిన చెట్టును నరికేసి, పచ్చగా ఉన్న మరో చెట్టు నీడన చేరిన ఘనుడు కన్నా అని, కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని ఆయన ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
buddha

More Telugu News