Manasa sarovar: మానస సరోవర యాత్రికులు క్షేమం.. నేపాల్ నుంచి నేరుగా నేడు గుంటూరుకు యాత్రికులు: మంత్రి ప్రత్తిపాటి

షార్ట్స్‌లో చూడండి
మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న గుంటూరు వాసులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యాత్రికు వెళ్లిన వారిలో కొంతమందితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వారంతా నేపాల్ సరిహద్దులో ఉండిపోయారని అన్నారు. రెండుమూడు రోజులు యాత్రకు అంతరాయం కలిగిందని చెప్పారు.

యాత్రకు వెళ్లిన 132 మంది నేడు నేపాల్ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గుంటూరు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు. నేడు, రేపటిలోగా మొత్తం 132 మంది గుంటూరు చేరుకుంటారని వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నిత్యం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారుల ద్వారా యాత్రికులతో టచ్‌లో ఉన్నట్టు చెప్పిన ప్రత్తిపాటి వారి విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
Go Back to Shorts
Manasa sarovar
Guntur District
Andhra Pradesh
Prathipati

More Telugu News