Vijayawada: ఓ అమ్మాయి మోసం చేసిందంటూ విజయవాడ లాడ్జిలో యువకుడి ఆత్మహత్య!

  • పనిమీద వచ్చానని చెప్పి లాడ్జిలో రూమ్ తీసుకున్న వంశీకృష్ణ
  • ప్రేమ విషయంలో యువకులంతా జాగ్రత్తగా ఉండాలని సూసైడ్ నోట్
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఓ అమ్మాయి వల్ల తన జీవితం నాశనమైందని సూసైడ్ నోట్ రాసిపెట్టిన ఓ యువకుడు విజయవాడ, గవర్నర్ పేటలోని అఖిల్ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన వంశీకృష్ణగా ఇతనిని పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం పనిమీద విజయవాడకు వచ్చినట్టు చెప్పుకున్న వంశీకృష్ణ, లాడ్జిలో రూమ్ తీసుకున్నాడని తెలుస్తోంది.

గదిలోకి వెళ్లిన వంశీకృష్ణ, ఎంతకీ బయట కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టి చూడగా స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తరువాత తలుపులు పగులగొట్టి చూడగా, వంశీకృష్ణ మృతదేహం కనిపించింది. పక్కనే ఓ సూసైడ్ నోట్ కూడా ఉంది. తాను ప్రేమలో పడి మోసపోయానని, ప్రేమ విషయంలో యువకులంతా జాగ్రత్తగా ఉండాలని దానిలో రాసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, బంధువులకు సమాచారం అందించారు.
Vijayawada
Akhil Lodge
Vamsikrishna
Love Failure
Sucide

More Telugu News