మహేశ్ బాబు కోసం కథ రెడీ చేసిన సురేందర్ రెడ్డి
- 'సైరా' షూటింగుతో బిజీగా సురేందర్ రెడ్డి
- ఆ తరువాత సినిమా మహేశ్ బాబుతో
- గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'అతిథి'
ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. డెహ్రాడూన్ లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మహేశ్ బాబును కలిసి కథను వినిపించే పనిలో సురేందర్ రెడ్డి వున్నాడని అంటున్నారు. గతంలో సురేందర్ రెడ్డి .. మహేశ్ బాబు కాంబినేషన్లో 'అతిథి' సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా మహేశ్ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అందువలన ఈ సారి మహేశ్ ఫ్యాన్స్ మెచ్చేలా కథను రెడీ చేసుకున్నాడట. మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే .. సురేందర్ రెడ్డి ఆ తరువాత సినిమాను బన్నీతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.