ntr national awards: ఈ నెల 6న కన్నడ ప్రముఖులకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు

షార్ట్స్‌లో చూడండి
2018 సంవత్సరానికి గాను కన్నడ ప్రముఖులను ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, సాహితీవేత్త హంసలేఖను, ప్రఖ్యాత నాటక రంగ కళాకారిణి అరుంధతినాగ్ లను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్.వి.హరీశ్, ప్రధాన కార్యదర్శి సి.వి. శ్రీనివాసయ్య ఈ మేరకు బెంగళూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు స్థానిక రవీంద్ర కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకుని ఈ పురస్కారాలను అందజేయనున్నారు. 
Go Back to Shorts
ntr national awards
bangalore

More Telugu News