balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం వచ్చిన విద్యాబాలన్

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఈ పాత్రను చేయడానికి విద్యాబాలన్ కొన్ని షరతులు విధించి, అందుకు టీమ్ అంగీకరించిన తరువాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమా షూటింగులో జాయిన్ కావడానికి ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. ముందుగా ఆమెకి సంబంధించిన పోర్షన్ ను దర్శకుడు క్రిష్ చిత్రీకరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాల పరంగా బిజీగా వున్నారు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను ఆ తరువాత షూట్ చేస్తారు. మొదటి నుంచి కూడా బరువైన పాత్రలను చేయడంలో విద్యాబాలన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. అందువలన ఆమె కారణంగా బసవతారకం పాత్రకు మరింత నిండుదనం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      
Go Back to Shorts
balakrishna
vidyabalan

More Telugu News