వాతావరణ పరిస్థితులను కూడా మార్చేస్తున్నారు... ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆరోపణలు!
- మా మేఘాలను దొంగిలిస్తోంది
- పక్క దేశాల్లో వర్షాలున్నా తమకు లేవని ఆరోపణ
- సైంటిఫిక్ విభాగం అధ్యయనంలో తేలిందన్న ఇరాన్
ఇదే ప్రాంతంలోని మరో దేశంపైనా ఇజ్రాయెల్ వాతావరణ యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి మధ్యదరా సముద్ర ప్రాంతం వరకూ 2,200 మీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయి ఉందని, ఇరాన్ పై మాత్రం అది లేదని ఆయన తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ఇరాన్ లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పక్క దేశాల్లో వర్షాలు పడుతున్నా, ఇరాన్ పై మాత్రం వరుణుడు కరుణించడం లేదు.