తనను అసభ్యకరంగా తాకిన బాలీవుడ్ సింగర్ తండ్రిని బాదేసిన వినోద్ కాంబ్లీ భార్య!
- ముంబైలోని ఇనార్బిట్ మాల్ లో ఘటన
- ఆండ్రియాను అసభ్యంగా తాకిన రాజేంద్ర తివారీ
- తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తో కొట్టిన ఆండ్రియా
ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంబ్లీ, మాల్ లోని గేమ్ జోన్ వద్ద తామున్న సమయంలో ఆ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఆపై కాసేపటికి తాము ఫుడ్ కోర్టు వద్దకు వెళ్లగా, రాజేంద్ర అతని ఇద్దరు కుమారులతో వచ్చి తమపై దాడికి దిగారని, దూరంగా ఉండాలని తాను హెచ్చరిస్తే, "మీరెవరో మాకు తెలియదు" అంటూ రెచ్చిపోయారని ఫిర్యాదు చేశాడు. కాగా, తివారీలు సైతం అకారణంగా కాంబ్లీ దంపతులు తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.