madhavan: నిర్మాతగా కోన వెంకట్ .. కీలకపాత్రలో మాధవన్

షార్ట్స్‌లో చూడండి
తమిళ స్టార్ హీరోల్లో ఒకరిగా కనిపించే మాధవన్, హిందీ సినిమాలపై దృష్టిపెడుతూ వచ్చాడు. ఈ మధ్య ఆయన తెలుగు సినిమాలపై కూడా శద్ధ పెడుతున్నాడు. పాత్ర నచ్చితే చాలు చేయడానికి ఆయన అంగీకరించేస్తున్నాడు. తెలుగులోనూ మాధవన్ కి మంచి క్రేజ్ ఉండటం వలన, అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వెళుతున్నాయి. అలా ఆయన ప్రస్తుతం 'సవ్యసాచి'లో విలన్ గా విభిన్నమైన పాత్రను చేస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ తరువాత మాధవన్ కి తెలుగు నుంచి మరిన్ని అవకాశాలు వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ నిన్నటి వరకు వినిపించింది. కానీ ఈ సినిమా సెట్స్ పై వుండగానే మాధవన్ కి మరో ఛాన్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. రచయిత కోన వెంకట్ నిర్మాతగా .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కీలకమైన పాత్రకి మాధవన్ అయితే బాగుంటుందని భావించిన కోన .. మాధవన్ ను సంప్రదించడం, ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.       
Go Back to Shorts
madhavan

More Telugu News