తండ్రిని హత్య చేసిన భర్తపై ఎనిమిదేళ్ల పగ... ఇలా తీర్చుకుంది!

  • 2010లో పిల్లనిచ్చిన మామను హత్య చేసిన రమేష్
  • జైలుకు వెళ్లి వచ్చిన తరువాత భార్యపై వేధింపులు
  • ఇటుకలతో మోది హత్య చేసిన భార్య
తన తండ్రిని దారుణంగా హత్య చేసిన భర్తపై ఎనిమిదేళ్ల పాటు పగ పెంచుకుని హత్య చేసిన భార్య ఉదంతం తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, దట్నూరు గ్రామంలో అలిశెట్టి రమేష్, రమ దంపతులు కాగా, వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రమేష్ వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు.

ఎనిమిదేళ్ల క్రితం 2010లో ఆర్థిక పరమైన వివాదంలో తనకు పిల్లనిచ్చిన మామ కుంటి రాజయ్యతో గొడవపడి, ఆయన్ను హత్య చేశాడు. ఈ కేసులో కొంతకాలం జైలు శిక్షను కూడా అనుభవించాడు. తిరిగి వచ్చిన తరువాత మద్యానికి బానిసై నిత్యమూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి రమ ఇటుకలతో భర్త తలపై మోది హత్య చేసి ఇంటి నుంచి పారిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు, పారిపోయిన రమ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 
Go Back to Shorts
Jagityala
Murder
Police
Ramesh
Rama

More Telugu News