50 రోజులను పూర్తి చేసుకున్న 'మహానటి'
- సావిత్రి పట్ల గల అభిమానం
- ఆమె జీవితం పట్ల గల ఆసక్తి
- స్టార్ హీరో .. హీరోయిన్స్ వలన పెరిగిన క్రేజ్
కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాకి ఈ స్థాయి విజయం లభించడం నిజంగానే గొప్ప విషయం. సావిత్రికి గల క్రేజ్ .. ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి .. యూత్ లో క్రేజ్ వున్న హీరో హీరోయిన్స్ ముఖ్యమైన పాత్రలను పోషించడం .. అలాగే సీనియర్ ఆర్టిస్టుల కారణంగా చేకూరిన బలం ఈ సినిమా విజయంలో తమవంతు పాత్రను పోషించాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ ను ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో అగ్రస్థానంలో నిలబెట్టేసింది.