చంద్రబాబుకు గుడి.. 10 కేజీల వెండితో విగ్రహం

  • నంద్యాలలో గుడికడుతున్న హిజ్రాలు
  • శంకుస్థాపన చేసిన అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి  
  • ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న టీజీ, అభిరుచి మధు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు ఏకంగా గుడిని కట్టిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి ఈరోజు మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు శంకుస్థాపన చేశారు. హిజ్రాలకు రూ. 1500 పెన్షన్ తో పాటు తెల్ల రేషన్ కార్డును కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై కృతజ్ఞతతో హిజ్రాలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణానికి ఎంపీ టీజీ వెంకటేష్, మంత్రి అఖిలప్రియ, స్థానిక నేత అభిరుచి మధులు సహకరిస్తున్నారు. 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu
temple
hijra
akhilapriya
tg venkatesh

More Telugu News