దారితెలియక గూగుల్ మ్యాప్ చూస్తున్న నటి సంజనా సింగ్... సెల్ ఫోన్ లాక్కెళ్లిపోయిన దొంగ!
- చెన్నై పెరంబూరు సమీపంలో దొంగతనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
- దొంగ కోసం గాలిస్తున్నామన్న పోలీసులు
ఉదయం 6 గంటల సమయంలో ముగపేర్ నుంచి అన్నా నగర్ లోని తన సోదరి ఇంటికి సైకిల్ పై వెళ్లి వస్తున్న వేళ ఎక్కువ దూరం సైక్లింగ్ చేసింది. ఆ సమయంలో ఎటు వెళ్లాలో తెలియక సెల్ ఫోన్ లో చూసుకుంటూ నెమ్మదిగా వస్తుండగా, చింతామణి సిగ్నల్ సమీపంలో దొంగతనం జరిగింది. తాను ఆ దొంగను వెంబడించేందుకు ప్రయత్నించినా, దొరకలేదని ఆమె అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ మేరకు కేసు నమోదైంది. దొంగ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.