తన రెండో కొడుకును పరిచయం చేసిన ఎన్టీఆర్!
Add ap7am to your home Screen

తన రెండో కొడుకును పరిచయం చేసిన ఎన్టీఆర్!

  • గత వారంలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ దంపతులు
  • తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తొలి పోస్టుగా చిత్రం
  • అభయ్ రామ్ చేతుల్లో తమ్ముడు
గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఖాతా తెరిచిన ఎన్టీఆర్, దానిలో తొలి పోస్టుగా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు ఇందులో కనిపిస్తోంది. ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్న ఫొటోను మీరూ చూడవచ్చు.
NTR
Second Son
Instagram

More Telugu News