buddha venkanna: వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే!: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయని, రాజకీయ, భౌతిక దాడులకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. నాడు గోద్రా అల్లర్లలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మోదీ వ్యవహరించారని, దీనిని వ్యతిరేకించినందుకే చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని అన్నారు.

ప్రధానిగా మోదీ ఉన్నంత వరకూ దేశ ప్రజలకు రక్షణ ఉండదని, దేశంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షాలకు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు రాష్ట్ర సమాచారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. మోదీని గద్దె దించే దమ్ము చంద్రబాబుకే ఉందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
buddha venkanna

More Telugu News