YSRCP: బుగ్గన, ఆకుల అడ్డంగా దొరికిపోయారు: టీడీపీ ఎంపీ కనకమేడల

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ, బీజేపీ నేతలు ఢిల్లీలో కలిసిన వ్యవహారంపై టీడీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ విషయమై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. ఢిల్లీ పెద్దలను కలిసిన వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు పొంతన లేని వాదనలు వినిపిస్తున్నారని, మొండిగా వాదిస్తున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై బుగ్గన, ఆకుల మూడు రకాల వాదనలు వినిపించారని అన్నారు. పీఏసీ చైర్మన్ పదవిని దుర్వినియోగం చేసిన బుగ్గన ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హుడని ఆయన అన్నారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బుగ్గన ఈ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం మంచిదని సూచించారు. బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్న వైసీపీ, తన ముసుగు తొలగించుకుని ఎవరిని కలసినా ఎవరికీ అభ్యంతరం ఉండదని కనకమేడల హితవు పలికారు.
Go Back to Shorts
YSRCP
Telugudesam
kanakamedala

More Telugu News