దళిత బాలురను నగ్నంగా నిలబెట్టి కొట్టిన అగ్రకులస్తులు.. వీడియో పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ
Add ap7am to your home Screen

దళిత బాలురను నగ్నంగా నిలబెట్టి కొట్టిన అగ్రకులస్తులు.. వీడియో పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ

  • అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయడమే వీరు చేసిన తప్పు
  • మానవజాతి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది
  • బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది
  • పోరాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా వకడి అనే గ్రామంలో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దళిత బాలలు.. ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయగా వారిని పట్టుకున్న కొందరు అగ్రకులస్తులు నగ్నంగా ఊరేగించి, కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ కాలంలోనూ అంటరాని తనం, అస్పృశ్యత ఇంత దారుణంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ స్పందిస్తూ... 'ఈ దళిత బాలలు చేసిన ఏకైక తప్పు ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయడమే.. మానవ జాతి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. లేదంటే చరిత్ర మనల్ని క్షమించదు' అని పేర్కొన్నారు.
Rahul Gandhi
Congress
Twitter

More Telugu News