రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్

  • విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్
  • ఈ పండగ దేశ ప్రజలందరికీ శుభాలను అందించాలి
  • నా తరపున, జనసైనిక్స్ తరపున రంజాన్ శుభాకాంక్షలు
మానవత్వాన్ని మేలుకొలిపేది, మానవులను మంచిగా బతకమని చెప్పేది రంజాన్ అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్..ఇటువంటి గొప్ప సందేశాన్ని అందించే రంజాన్ మాసాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించే ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ నా తరపున, జనసైనిక్స్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. భారత దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ రంజాన్ పండగ స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు ఆచరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ రంజాన్ పండగ దేశ ప్రజలందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
ramzan

More Telugu News