'ఢాం' అన్న మరో రెడ్ మీ స్మార్ట్ ఫోన్!
- శంషాబాద్ లో ఘటన
- ఇటీవలే కొత్త ఫోన్ కొన్న యువకుడు
- పొగలు వచ్చి పేలిపోయిన ఫోన్
అతను కూరగాయల మార్కెట్ లో ఉన్న వేళ, సెల్ ఫోన్ రింగ్ అయింది. బయటకు తీస్తుంటే ఫోన్ నుంచి పొగలు వస్తూ కనిపించడంతో, దాన్ని కింద పడేశాడు. చూస్తుండగానే అది పేలిపోయింది. ఈ ఘటనపై కంపెనీకి ఫిర్యాదు చేసిన చిట్టిబాబు, అది జేబులో పేలుంటే తన ప్రాణాలు పోయుండేవని వాపోయాడు.