ntr: ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్‌!

షార్ట్స్‌లో చూడండి
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తన కుటుంబ సభ్యులకు చెందిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అప్పట్లో అరుదుగా ట్వీట్లు చేస్తూ కనపడిన తారక్‌ ఇప్పుడు ఏదో ఒక విషయంపై తరుచూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నాడు.

తాజాగా, ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే 15,000 మంది ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు. ఇందులో ఆయన తన మొట్టమొదటి పోస్ట్‌గా తన కొత్త సినిమా 'అరవింద సమేత.. వీర రాఘవ' పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. లవకుశ సినిమాతో హిట్‌ కొట్టిన ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తోన్న ఆ సినిమాకి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో తారక్‌కి రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.            
Go Back to Shorts
ntr
Instagram
Twitter

More Telugu News