ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ లకి గిఫ్ట్ గా ఖరీదైన కార్లు.. అసలు విషయం!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ లకి గిఫ్ట్ గా ఖరీదైన కార్లు.. అసలు విషయం!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • నిర్మాతగా చినబాబు
  • కథానాయికగా పూజా హెగ్డే    
ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే .. ఈషా రెబ్బా కథానాయికలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా నిర్మాత చినబాబు ఖరీదైన కార్లు కొని, ఒకటి త్రివిక్రమ్ కి .. మరొకటి ఎన్టీఆర్ కి గిఫ్ట్ గా ఇచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది.

అసలు విషయమేమిటంటే .. రీసెంట్ గా నిర్మాత చినబాబు ఓ ఖరీదైన కారును తీసుకున్నారట. ఆ తరువాత మనసు మార్చుకుని 'రేంజ్ రోవర్ వెలార్ పి 25' మోడల్ కారును తీసుకోవాలనుకున్నారు. ముందుగా తీసుకున్న కారును మార్చవలసిన అవసరం లేదనీ .. అది తనకి నచ్చిందని ఆయన నుంచి త్రివిక్రమ్ తీసుకున్నాడట. ఇక నిర్మాత కొత్తగా తీసుకున్న రేంజ్ రోవర్ కారును .. షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ కి పంపించాలనుకున్నారు. అందుకోసం ఆయనకి ఇష్టమైన నెంబర్ 9999ను తీసుకున్నారట. ఈ కారణంగానే ఈ నిర్మాత త్రివిక్రమ్ కి .. ఎన్టీఆర్ కి కార్లను గిఫ్ట్ గా ఇచ్చాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది.       
trivikram
ntr

More Telugu News