మొత్తానికి చిక్కాడు.. కర్ణాటక పోలీసుల అదుపులో గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు!

  • మహారాష్ట్రలో చిక్కిన నిందితుడు
  • విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్న సిట్
  • మరాఠీ మాట్లాడుతున్న నిందితుడు
ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసు నిందితుడు ఎట్టకేలకు కర్ణాటక పోలీసులకు చిక్కాడు. మరాఠీ మాట్లాడుతున్న అనుమానితుడిని సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపింది అతడే అని అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఏ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నదీ చెప్పేందుకు నిరాకరించాయి. కాగా, నిందితుడి గురించి మరిన్ని వివరాలు వెల్లడించే ముందు అతడిని విచారించాల్సి ఉంటుందని సిట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

తమ బృందాల్లో ఒకటి 30 ఏళ్లు దాటిన ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి. అతడు 5 అడుగుల పొడవు ఉన్నాడని, బరువు సుమారు 80 కేజీలు ఉన్నాడని తెలిపాయి. అయితే, అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లభ్యం కాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Gauri Lankesh
Karnataka
Maharashtra
suspect

More Telugu News