ఎన్టీఆర్ తో కలిసి నటించడం అంత తేలికైన విషయం కాదు: ఈషా రెబ్బా
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ తో కలిసి నటించడం అంత తేలికైన విషయం కాదు: ఈషా రెబ్బా

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • ఆయన సరసన పూజా హెగ్డే 
  • మరో జోడీగా ఈషా రెబ్బా 
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా .. మరో కథానాయికగా ఈషా రెబ్బా చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ .. ఈషా రెబ్బా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా రెబ్బా చేస్తోన్న పెద్ద సినిమా ఇదేనని చెప్పాలి.

తాజాగా ఆమె మాట్లాడుతూ .. త్రివిక్రమ్ మూవీలో అవకాశం లభించడం నా అదృష్టమేనని చెప్పాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన త్రివిక్రమ్ కి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలోని నా పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఆయనతో కలిసి నటించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే విషయం నాకు మొదటిరోజునే అర్థమైపోయింది. కెమెరా ముందుకు రాగానే సీన్ పై మాత్రమే దృష్టి పెట్టి పాత్రలోకి వెళ్లిపోయే ఆయన, ఆ తరువాత సెట్లో అందరితోనూ చాలా సరదాగా కబుర్లు చెబుతారు" అని చెప్పుకొచ్చింది.    
ntr
eesha rebba

More Telugu News