సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తమన్నా జోరు ఎందుకు తగ్గింది?
  • పొల్లాచ్చికి 'అరవింద సమేత' పయనం 
  • చైనాలో విడుదల కానున్న 'రంగస్థలం'
  • రాజమండ్రిలో తమిళ స్టార్ అజిత్
*  ఇటీవలి కాలంలో తెలుగులో కథానాయిక తమన్నా జోరు తగ్గింది. ఆమెకు అవకాశాలు రాకపోవడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని, తనకు తానే సినిమాలు తగ్గించుకున్నానని తమన్నా చెప్పింది. 'గత కొన్నేళ్లుగా విరామం అన్నది లేకుండా నటించాను. దాంతో కాస్త విశ్రాంతి కోరుకున్నాను. అందుకే తగ్గించుకున్నాను' అంటూ అమ్మడు కవరింగ్ ఇచ్చింది.  
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతుంది. అక్కడ రెండు వారాల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.  
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చైనాలో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చరణ్ వెల్లడించాడు.  
*  తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా షూటింగ్ త్వరలో రాజమండ్రిలో జరగనుంది. శివకుమార్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న 'విశ్వాసం' చిత్రానికి సంబంధించిన యాక్షన్ దృశ్యాలను రాజమండ్రిలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Thamanna
NTR
charan
ajith

More Telugu News