పవన్ కల్యాణ్ ప్రసంగాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ ప్రసంగాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • ప్రజలను అక్కున చేర్చుకునే విధంగా పవన్ ప్రసంగాలు ఉన్నాయి
  • రాజకీయాల్లో నూతన ఒరవడికి పవన్ కారణమవుతారు
  • ప్రజలకు పవన్ మంచి నాయకత్వం అందిస్తారు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయని, ప్రజలను అక్కున చేర్చుకునే విధంగా ఉన్నాయని ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశంసించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి పవన్ కల్యాణ్ కారణమవుతారు. ఎందుకంటే, ఊకదంపుడు ఉపన్యాసాలు విని విసిగిపోయిన ప్రజలకు పవన్ మంచి నాయకత్వం అందిస్తారు. ప్రజలతో పవన్ కల్యాణ్ మమేకమవడం, సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి చూస్తుంటే ఒక ఉద్యమ నాయకుడిలా కష్టపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించాలనే దాని కంటే..ప్రజాసేవ అనే గొప్ప కార్యక్రమంతో పవన్ ముందుకొచ్చారు... ‘నేను ముఖ్యమంత్రిని కావాలని రాజకీయాల్లోకి రాలేదు’ అనే పవన్ నినాదం ప్రజలకు నచ్చవచ్చు. రాబోయే రోజుల్లో ఒక ప్రభంజనానికి పవన్ కారణమవుతారని చెప్పొచ్చు’ అని అన్నారు. 
Pawan Kalyan
kethi reddy

More Telugu News