ఒక రేంజ్ లో దూసుకుపోతోన్న 'సామి స్క్వేర్' ట్రైలర్
- హరి దర్శకత్వంలో విక్రమ్
- గతంలో వచ్చిన 'సామి'కి సీక్వెల్
- విక్రమ్ జోడీగా కీర్తి సురేశ్
ఈ నెల 3వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 8 మిలియన్ల వ్యూస్ .. 172k కి పైగా లైక్స్ రావడం విశేషం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన కథలను ఉత్కంఠభరితంగా చెప్పడంలో దర్శకుడు హరి సిద్ధహస్తుడు. పైగా ఇది గతంలో ఘన విజయాన్ని అందుకున్న సినిమాకి సీక్వెల్. ఈ కారణంగానే ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు వున్నాయి. విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.