కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటా: కేఈ
- కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోదు
- పవన్, జగన్ లు బీజేపీతో చేతులు కలపడం బాధాకరం
- పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం
కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీచ రాజకీయాల్లో భాగంగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్, జగన్ లు బీజేపీతో చేతులు కలపడం బాధాకరమని అన్నారు. పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని చెప్పారు.