కాస్టింగ్ కాల్.. ఎన్టీఆర్ బయోపిక్‌లో కొన్ని పాత్రలకు కొత్తవారికి ఆహ్వానం
- casting.ntrbiopic@gmail.com కి మీ వివరాలు పంపండి
- రెండు ఫొటోలు, 30 సెకన్ల మీ నటన వీడియో సెండ్ చేయండి
- 'ఎన్టీఆర్' సినిమాలో నటించే అవకాశం కొట్టేయండి
"నటిస్తూ తెరమీద కనబడుతూ జీవించాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ మంచి అవకాశాలు రానివారు కొందరు.. అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం" అంటూ ఆ సినిమా యూనిట్ ఓ ప్రకటన చేసింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు రెండు ఫొటోలు పంపాలని, అలాగే స్మార్ట్‌ఫోన్‌లో తమ నటన ఏపాటిదో చూపెడుతూ 30 సెకన్లకు మించకుండా ఓ వీడియో తీసి తమకు మెయిల్ చేయాలని కోరింది.