హృతిక్ రోషన్ జోడీగా ఛాన్స్ పట్టేసిన దిశా పఠాని!
- తెలుగులో 'లోఫర్' చేసిన దిశా పఠాని
- హిందీలో 'భాగీ 2'తో దక్కిన సక్సెస్
- స్టార్ హీరోల సరసన ఛాన్సులు
ఈ ప్రయత్నంలో భాగంగానే ఆమెకి 'భాగీ 2' సినిమాతో హిట్ దక్కింది. ఈ సినిమా సక్సెస్ తో పలువురు దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన దిశాకి సల్మాన్ ఖాన్ మూవీలో ఒక హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక హృతిక్ రోషన్ సినిమాలోను ఛాన్స్ పట్టేసిందనేది తాజా సమాచారం. సాజిద్ నడియడ్ వాలా నిర్మించనున్న ఈ సినిమాకి రోహిత్ ధావన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలతో అమ్మడు బాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.