తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా గులాం నబీ ఆజాద్!

  • వచ్చే ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి
  • టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా ఆజాద్!  
  • త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కుంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను నియమించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీ వ్యవహారాల్లో ఆజాద్ క్రియాశీలకంగా వ్యవహరించారు.  
Go Back to Shorts
Telangana
Congress
gulam nabi azad

More Telugu News