ఓవర్సీస్ లో కొత్త రికార్డుల దిశగా వెళుతోన్న 'మహానటి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓవర్సీస్ లో కొత్త రికార్డుల దిశగా వెళుతోన్న 'మహానటి'

  • దూసుకుపోతోన్న 'మహానటి' 
  • ఏ ప్రాంతంలోనూ తగ్గని ఆదరణ 
  • కొత్త రికార్డుల దిశగా పరుగులు      
ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహానటి' తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో 'మహానటి' 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. సావిత్రికి గల క్రేజ్ .. ఆమె జీవితం విషాదాంతం కావడానికి గల కారణాలను తెలుసుకోవాలనే అభిమానుల ఆసక్తి ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో .. అనూహ్యమైన ఆదరణతో టాప్ టెన్ చిత్రాల జాబితాలోకి ఎంటరైన 'మహానటి'... 'అజ్ఞాతవాసి', 'ఫిదా',  ఖైదీ నెంబర్ 150','అ ఆ' సినిమాల రికార్డులను అధిగమిస్తూ ముందుకు వెళ్లి 6వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకి ముందు స్థానంలో 'శ్రీమంతుడు' రికార్డు వుంది. ఆ రికార్డును కూడా 'మహానటి' అధిగమించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనంలో సావిత్రి పట్ల గల అభిమానం ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.      
keerti suresh
dulquer

More Telugu News