prithvi raj: నాకు ఒక్కడే కొడుకు .. డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యాము!: పృథ్వీరాజ్

షార్ట్స్‌లో చూడండి
తాజాగా నటుడు పృథ్వీరాజ్ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మనసు బరువెక్కే ఒక విషయం చెప్పారు. " కెరియర్ పరంగా ఎందుకు గ్యాప్ వచ్చింది అని అంతా నన్ను అడుగుతుంటారు. సినిమా అవకాశాలు తగ్గడం వల్లనేనా? .. పరాజయాలు ఎదురుకావడమే అందుకు కారణమా? అని అంటూ వుంటారు. అన్ని ప్రశ్నలకి 'అవును ' అనే నేను సమాధానమిస్తుంటాను. కానీ కెరియర్ పరంగా నాకు గ్యాప్ రావడానికి  అసలు కారణం నా ఒక్కగానొక్క కొడుకు"

"మా బాబు చాలా అందంగా ఉండేవాడు .. వాడిని చూసి మేము మురిసిపోయేవాళ్లం. కానీ ఒక రోజున వాడిని చూసిన మా నాన్నకి ఏదో అనుమానం వచ్చింది. ఆయన మాట మేరకు బాబును హాస్పిటల్ కి తీసుకెళ్లాం. మా బాబుకు మానసికపరమైన ఎదుగుదల లేదనే విషయం తెలిసి షాకయ్యాము. దగ్గరుండి అన్ని విషయాలు మేమే చూసుకోవాలని డాక్టర్ చెబితే .. బాధను భరిస్తూనే ఆ నిజాన్ని స్వీకరించాం. ఆ బాబు కోసమే సమయమంతా కేటాయించాలి గనుక ఒక్కరు చాలనుకున్నాం .. ఇప్పుడు వాడి వయసు 22 యేళ్లు" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
prithvi raj

More Telugu News