విక్రమ్ మూవీ కోసం యూరప్ కి కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

విక్రమ్ మూవీ కోసం యూరప్ కి కీర్తి సురేశ్

  • హరి దర్శకత్వంలో 'సామి 2'
  • విక్రమ్ జోడీగా కీర్తి సురేశ్ 
  • త్వరలో పాట చిత్రీకరణ  
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా రూపొందుతోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ కనిపించే ఈ సినిమా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోంది. గతంలో హరి .. విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'సామి' సినిమాకి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'కారై కుడి'లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది.ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూ ల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. విక్రమ్ ..కీర్తి సురేశ్ లపై అక్కడ ఒక డ్యూయెట్ ను చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. విక్రమ్ కి .. కీర్తి సురేశ్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉండటం వలన, తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   
vikram
keerthi suresh

More Telugu News