భారత సైన్యం నుంచి దొంగిలించిన ఆయుధాలు ఇవే... ఫొటో విడుదల చేసిన ఉగ్రవాదులు

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్, తాము భారత సైన్యం నుంచి దొంగిలించిన ఆయుధాలు ఇవేనంటూ ఓ ఫొటోను విడుదల చేయడం తీవ్ర కలకలం రేపుతోంది, 'హమ్జా హజ్బీ' పేరిట ఉన్న ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫొటో విడుదల కాగా, ఇందులో మూడు సర్వీస్ తుపాకులు కనిపిస్తున్నాయి.

ఇటీవల తమ పోస్టుపై దాడి చేసిన ఉగ్రవాదులు ఆయుధాలను ఎత్తుకెళ్లారని ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఆయుధాలే ఇవని తెలుస్తోంది. గురువారం సాయంత్రం శ్రీనగర్ సిటీ పరిధిలోని ఓ హోటల్ ముందున్న గార్డు పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆయుధాలను ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులను సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులెవరూ లేకపోవడంతో ఆయుధాల దోపిడీపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Go Back to Shorts
Srinagar
Jammu And Kashmir
Wepons
Terrorists
Hizbul Muzahiddeen

More Telugu News