'మహానటి' సక్సెస్ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి' సక్సెస్ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్

  • ఘన విజయం సాధించిన 'మహానటి'
  • ఒక్కసారిగా పెరిగిన కీర్తి సురేశ్ క్రేజ్ 
  • తిరుమల శ్రీవారికి మొక్కులు
సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సావిత్రిగా కనిపించడంలోను .. సావిత్రిలా నటించడంలోను కీర్తి సురేశ్ మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటివరకూ కథానాయకుల సరసన ఆడుతూ పాడుతూ అలరిస్తూ వచ్చిన కీర్తి సురేశ్, కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని నడిపించిన సినిమా ఇది. ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో వెలికి తీసిన సినిమా ఇది.అందువల్లనే ఇప్పుడు ఎక్కడ చూసినా కీర్తి సురేశ్ ప్రస్తావనే వినిపిస్తోంది. ఇంతటి సక్సెస్ లభించిన ఆనందంలో, ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కీర్తి సురేశ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. వేదపండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి .. పట్టువస్త్రంతో ఆలయ మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. 'మహానటి' సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందనీ, ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం వలన స్వామివారి దర్శనం కోసం వచ్చినట్టు చెప్పింది.  
keerti suresh
dulquer

More Telugu News