అమెరికాలో 'మహానటి' జోరు .. 6వ స్థానం సొంతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో 'మహానటి' జోరు .. 6వ స్థానం సొంతం

  • తెలుగు రాష్ట్రాల్లో 'మహానటి' దూకుడు 
  • అమెరికాలోను వసూళ్ల జోరు 
  • నాగ్ అశ్విన్ కి .. కీర్తి సురేశ్ కి ప్రశంసలు
సావిత్రిని అభిమానించేవాళ్లు .. ఆరాధించేవాళ్లు ఎంతోమంది వున్నారు. ఆమెపట్ల వాళ్లకి గల అభిమానం ఎంత మాత్రం తగ్గలేదనడానికి కారణం, అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. అమెరికాలోను ఈ సినిమా తన దూకుడు చూపుతోంది. శుక్రవారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్ కి చేరువలో వుంది. అమెరికాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాలలో ఈ సినిమా 6వ స్థానంలో నిలిచింది. 'రంగస్థలం' .. 'భరత్ అనే నేను' .. 'అజ్ఞాతవాసి' .. 'భాగమతి' .. 'తొలిప్రేమ' సినిమాలు మొదటి అయిదు స్థానాల్లో ఉండగా, 6వ స్థానంలో 'మహానటి' నిలిచింది. సావిత్రి బాల్యం .. ఆమె నట జీవితం .. వ్యక్తిగత జీవితం తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం అంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కి .. ప్రధానమైన పాత్రను పోషించిన కీర్తి సురేశ్ కి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తుండటం విశేషం.  
keerti suresh
dulquer

More Telugu News