ఎంత బాగుందో చెప్పలేకపోతున్నాను: 'మహానటి' గురించి నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంత బాగుందో చెప్పలేకపోతున్నాను: 'మహానటి' గురించి నాని

  • నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభ అద్భుతం 
  • కీర్తి సురేశ్ చాలా గొప్పగా చేసింది 
  • సమష్టి కృషి ఫలితమే ఇది  
కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి .. సావిత్రి పాత్రను చేసిన కీర్తి సురేశ్ కి ప్రశంసలు తెలుపుతున్నారు. తాజాగా ఆ జాబితాలో నాని కూడా చేరిపోయాడు.

 "ఈ సినిమా ఎంత బాగుందంటే .. ఎంత బాగుందో చెప్పలేనంత!" అంటూ తన మనసులోని మాటను చెప్పేశాడు. సావిత్రి గారి పాత్రను కీర్తి సురేశ్ కంటే బెటర్ గా ఎవరూ చేయలేరంటూ కితాబునిచ్చాడు. నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభ గర్వించదగినదిగా ఉందని అన్నాడు. ఈ సినిమా నిర్మాతలకు .. సాంకేతిక నిపుణులకు .. నటీనటులకు ఆయన అభినందనలు తెలియజేశాడు.  
keerti suresh
samanta

More Telugu News