'మహానటి' శాటిలైట్ రైట్స్ 10 కోట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి' శాటిలైట్ రైట్స్ 10 కోట్లు!

  • నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి'
  • ప్రాజెక్టు ఆరంభంలో అంతగా లేని క్రేజ్ 
  • తెలివిగా అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్    
నాగ్ అశ్విన్ .. సావిత్రి బయోపిక్ గా 'మహానటి' ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడం, సావిత్రి జీవితచరిత్రలో విషాదమే హైలైట్ కావడం అందుకు కారణం. అందువలన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి లేదు .. అంచనాలు లేవు. ఈ కారణంగా శాటిలైట్ రైట్స్ కోసం కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఎప్పుడైతే 'మహానటి' ప్రాజెక్టులోకి మంచి క్రేజ్ వున్న ఆర్టిస్టులు చేరుతూ రావడం మొదలైందో .. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం మొదలైందో అందరి దృష్టి ఆ వైపుకు మళ్లింది. ఈ నేపథ్యంలో కొన్ని చానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడటం మొదలెట్టాయట. ఇక ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన ఒక ఛానల్ .. 10 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.   
keerti suresh
samnanta

More Telugu News