సావిత్రిగా కీర్తి సురేశ్ పలికించిన హావభావాలు అద్భుతం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రిగా కీర్తి సురేశ్ పలికించిన హావభావాలు అద్భుతం!

  • 'మహానటి'లో సావిత్రి కనిపించింది
  • కీర్తి సురేశ్ కెరియర్లో గొప్ప సినిమా 
  • ఆమెకి నూటికి నూరు మార్కులు  
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను పోషిస్తూ .. విలక్షణమైన నటనతో మెప్పించిన కథానాయికలు ఎంతోమంది వున్నారు. అలాంటి కథానాయికలలో ఒక్క సావిత్రి మాత్రమే 'మహానటి' అనిపించుకున్నారు. ఆమె జీవితచరిత్రగా రూపొందిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. నవరసాలను అవలీలగా పలికించే సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నప్పుడు చాలామంది నొసలు చిట్లించారు. అలాంటి కీర్తి సురేశ్ కి ప్రేక్షకులు ఇప్పుడు నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తున్నారు. సావిత్రి వ్యక్తిగత జీవితం .. వృత్తిపరమైన జీవితం .. జెమినీ గణేశన్ తో ప్రేమలో పడటం .. ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు పడిన ఆవేదన .. అయినవాళ్లే మోసం చేసినప్పుడు బాధను అనుభవించిన సందర్భాల్లో ఆమె నటన అద్భుతం అని చెబుతున్నారు. సావిత్రి పాత్రలో తమకి ఆమెనే తప్ప కీర్తి సురేష్ కనిపించలేదనీ, అంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ అభినందనలు తెలియజేస్తున్నారు
keerti suresh
samanta

More Telugu News