'మహానటి' సినిమాపై రాజమౌళి స్పందన
- నాగ్ అశ్విన్, స్వప్నలు చాలా గొప్పగా తీశారు
- సావిత్రికి కీర్తి సురేష్ జీవం పోశారు
- దుల్కర్ సల్మాన్ కి నేను అభిమానిగా మారాను
గొప్ప చిత్రాన్ని తీశారంటూ నాగ్ అశ్విన్, స్వప్నలను అభినందించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అంటూ కితాబిచ్చారు. తన జీవితంలో తాను చూసిన అత్యద్భుత పర్ఫామెన్స్ లలో ఈ చిత్రంలో కీర్తి సురేష్ ది ఒకటని చెప్పారు. మహానటికి ఆమె మళ్లీ జీవం పోశారని కితాబిచ్చారు. దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా ఉందని... అతనికి తాను ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోయానని ట్వీట్ చేశారు.