'మహానటి' టీమ్ నుంచి ప్రముఖులకు 'స్వీట్' గిఫ్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి' టీమ్ నుంచి ప్రముఖులకు 'స్వీట్' గిఫ్ట్!

  • నాగ్ అశ్విన్ దర్శకుడిగా 'మహానటి'
  • ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్ 
  • సినీప్రముఖులకు ఆహ్వాన పత్రికలు 
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా రూపొందింది. సావిత్రి జీవిత విశేషాలు .. ఈ సినిమా కోసం ఎంచుకున్న బలమైన తారాగణం ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. అందువలన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా థియేటర్లకు వస్తుందనీ, వచ్చి చూసి ఈ సెలబ్రేషన్ లో భాగస్వాములు కావాలని సినీ ప్రముఖులకు ఈ సినిమా టీమ్ ఆహ్వాన పత్రికలు పంపించినట్టుగా తెలుస్తోంది.

జీడిపప్పు మిఠాయితో కూడిన బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికలను పంపించడం విశేషం. అలాంటి ఆహ్వాన పత్రికను అందుకున్న 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసిన దర్శక నిర్మాతలు, విడుదల తేదీ నాటికి ప్రమోషన్స్ ను పతాకస్థాయికి తీసుకొచ్చి అంచనాలు పెంచేయడం విశేషం.   
keerti suresh
samanta

More Telugu News