sai dharam tej: పారిస్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను సాయిధరమ్ తేజ్ కి మంచి క్రేజ్ వుంది. అయితే కొంతకాలంగా ఆయనకి సక్సెస్ ముఖం చాటేస్తూ వస్తోంది. దాంతో ఆయన మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కథ కొత్తగా ఉందనే ఉద్దేశంతో ఆయన కరుణాకరన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. ఆయనతో కలిసి ' తేజ్ ఐ లవ్ యు'తో సెట్స్ పైకి వెళ్లడం జరిగిపోయాయి.

 కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను .. ఒక పాటను పారిస్ లో చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. పారిస్ లో చిత్రీకరించిన పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 
Go Back to Shorts
sai dharam tej

More Telugu News