'మహానటి' కోసం కీర్తి సురేశ్ కి బాగానే ముట్టజెప్పారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి' కోసం కీర్తి సురేశ్ కి బాగానే ముట్టజెప్పారట!

  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • అంతకంతకీ పెరుగుతోన్న ఆసక్తి
  • తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్  
తెలుగు సినిమా చరిత్రలో సావిత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. నవరసాలను కళ్లతోనే అలవోకగా అభినయించడం ఆమెకి మాత్రమే సాధ్యం. అలాంటి సావిత్రి పాత్రను పోషించి మెప్పించడం అంత తేలికైన పనేం కాదు. అంతటి కష్టతరమైన పాత్రను చేయడానికి కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి.

అయితే లుక్స్ పరంగా సావిత్రిలా కీర్తి సురేశ్ మంచి మార్కులు కొట్టేసిందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా ఆమె ఏ స్థాయిలో మెప్పిస్తుందా? అనే ఆసక్తితో ఈ నెల 9వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం కీర్తి సురేశ్ కోటి యాభై లక్షలను పారితోషికంగా తీసుకుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం వల్లనే ఆమె అంత మొత్తం తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఇలా పారితోషికం పరంగా కాజల్ .. సమంతల సరసన చేరిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
keerti suresh
samanta

More Telugu News